కెపిహెచ్బి కాలనీ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన గణేష్ మండప ప్రత్యేక పూజలో పాల్గొన్న బండి రమేష్
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 21: కూకట్పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కెపిహెచ్బి కాలనీ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన గణేష్ మండప వద్ద శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. గత 15 రోజులుగా ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు, మహిళలచే కుంకుమ పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ ఊరేగింపు అనంతరం గణేశుని నిమజ్జనానికి తరలించారు ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, పుష్ప రెడ్డి, మైఖేల్ ,అరవింద్ రెడ్డి, ఫణికుమార్, రేష్మ తదితరులు స్థానిక నాయకులు పనులు పాల్గొన్నారు.