ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం

ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 3

బిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. గణేష్ పూజ పూర్తయిన తర్వాత గణేష్ నిమజ్జన యాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు పిల్లలందరూ కలిసి కోలాటాలతో చిందులు వేస్తూ గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు అందరూ కలిసి పిల్లలతో సందడి చేస్తూ క్రమ పద్ధతిలో గణేష్ నిమజ్జనాన్ని కొనసాగించారు. పిల్లలకు పర్యావరణహితాన్ని బోధిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే గణేష్ ప్రతిమలను పూజించాలని టీచర్లు పిల్లలకు తెలియజేశారు. గత ఆరు సంవత్సరాలుగా సిద్ధార్థ విద్యాలయ ఆధ్వర్యంలో పర్యావరణహితాన్ని కోరే మట్టి గణపతిని మాత్రమే పూజిస్తున్నామని సమాజంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నామని పాఠశాల కరస్పాండెంట్ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ లింగాల శ్రీకాంత్ గౌడ్, మోహన్ రవి బాబు టీచర్లందరూ పాలుపంచుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment