టీమ్ ఎఫ్.వై.ఎన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

టీమ్ ఎఫ్.వై.ఎన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 31

టీమ్ ఎఫ్.వై.ఎన్ (ఫ్రెండ్స్ యూత్ నాగారం) ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు, పాటలు, మరియు లడ్డూ వేలం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కాశీ నుండి ప్రత్యేకంగా వచ్చిన బృందం నిర్వహించిన గంగా హారతి ఈ వేడుకకు మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలం పోటీలో…

* ప్రథమ లడ్డూను అనఘ ఇంజనీర్స్ ₹2,70,000కి దక్కించుకున్నారు.

* ద్వితీయ లడ్డూను సాయిల్ గ్రూప్స్ వారు ₹1,45,000కి సొంతం చేసుకున్నారు.

* తృతీయ లడ్డూను నొముల చంద్రు రెడ్డి ₹1,10,000కి దక్కించుకున్నారు.

“గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఊరంతా మార్మోగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో, కొత్త విశేషాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment