గణేశుడు మార్గ నిర్ధేశకుడు

గణేశుడు మార్గ నిర్ధేశకుడు

ప్రశ్న ఆయుధం ఆగష్టు 26గజ్వెల్

వెండి కొండల్లో వెలిగేటి రేడా

దండిగా పూజలు పొందేటి వాడ

ఎలుక వాహనము ప్రీతిన ఎక్కే గణేశ

కుడుములు, ఉండ్రాళ్ళు మెక్కే సర్వేశ

1. పెద్ద చిన్న అని ఎరుగకున్నారు

తల్లి దండ్రుల మీద ఉరుము తున్నారు

తల్లి దండ్రులంటే కనుపించు దేవుళ్ళు

స్వీయ అనుభవాల స్ఫూర్తి నిచ్చి పోవా ॥వెండి॥

2. శిలల తీర్చేటి శిల్పియే గురువనిరి

వేదాల సారమే నింపేటి ఘనుడనిరి

నీళ్ళ కన్న మిగుల పలచనయి పాయే

ఆది గురువు నీవు నీతి బోధన చేయు. ||వెండి॥

3. బాహ్య సౌందర్యము దినదినము కరుగు

ఆత్మ సౌందర్యము అలవెలిగి పోవు

పైపై మెరుగులకే పడిపోవు జనము

గజముఖ గణపతి మేల్కొల్పి పోవ ||వెండి॥

4. లేని పోని వెతల నలుగేటి మనుజుల

లేని ఆర్భాటాలు చూపించు నిశీధుల

ఎలుక వాహనము ఎన్నుట ఒక వింత

నిరాడాంబర జాడలో నడుపించుమిక ॥ వెండి॥

5 మాట మార్చేటి నిత్య అబద్ధులకు

మాట విలువ ఏమో మరి తెలిపి నావు

అమ్మ శీలము నిలుప ఆత్మార్పణజేశావు

తనయుడంటే లోకాన నీవే అని వెలిగావు. ||వెండి॥

– కవి, రచయిత తాటి కిషన్, గజ్వేల్

సెల్ నెంబర్ 9052454349.

Join WhatsApp

Join Now

Leave a Comment