అంగరంగ వైభవంగా గణనాధుని కుంకుమ పూజ
కరీంనగర్ ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా , కన్నుల పండుగ గా కొనసాగుతున్నాయి. అశోక్ నగర్ లోని జెండా చౌరస్తా , అశోక్ నగర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుల వద్ద కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు . కుంకుమ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టికార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి ,రమణ , విగ్రహ దాతలు గొట్టిముక్కుల జమున. మహేష్ లతోపాటు అశోక్ నగర్ యూత్ క్లబ్ సభ్యులు కందుకూరి వాత్సవ్ కట్ట రాజేష్ ,వంకార్ పరుశురాం ,సందీప్, రవితేజ రావుల బిట్టు, పెందోట వినేష్ లతోపాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.