*భక్తిశ్రద్ధలతో గణేష్ ని పూజిస్తే గణేశుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయి*
*మండల తహసిల్దార్ గట్ల రమేష్ బాబు*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11;
భక్తిశ్రద్ధలతో గణేశుని పూజిస్తే గణేశుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయని జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు అన్నారు.బుధవారం గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట బస్టాండ్ దగ్గర హనుమాన్ ఆలయ కమిటీ ఏర్పాటుచేసిన గణేశుడిని జమ్మికుంట తాసిల్దార్ రమేష్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తహసిల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సకల శుభాలు జరిగి విఘ్నాలు తొలగిపోవాలంటే ఆ గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని ఆయన కోరారు. నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పాటలు భజనలు చేస్తూ భక్తులు నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసుకోవాలని కోరారు అనంతరం హనుమాన్ ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాటుచేసిన అన్న ప్రసాద కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. లేనివారికి పెడితే పుణ్యం వస్తుందని అన్నాన్ని వృధా చేయొద్దని ఆయన కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ సర్వేయర్ మనోజ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.