నిజామాబాద్ డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడిగా గంగా మోహన్ నియామకం

నిజామాబాద్ డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడిగా గంగా మోహన్ నియామకం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ చేతుల మీదుగా వోజ. గంగా మోహన్ ను నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, బీసీ ల ఐక్యత కోసం సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన డివిజన్ అధ్యక్షులు గంగా మోహన్ మాట్లాడుతూ, “బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నాకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేస్తాను. ఈ పదవికి సహకరించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదములు” అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment