విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ బహుమతుల బహుకరణ

విద్యార్థులకు
Headlines in Telugu
  1. ఇల్లందకుంటలో 200 విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ బహుమతులు
  2. హుజురాబాద్ గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించింది
  3. బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పెన్నుల పంపిణీ
  4. గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ విద్యార్థుల అభివృద్ధికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది
  5. ఇల్లందకుంట పాఠశాల విద్యార్థులకు ట్రస్ట్ బహుమతులు: కేవలం పెన్నులు కాదు, మరిన్ని సేవలు

*ఇల్లందకుంట నవంబర్ 20 ప్రశ్న ఆయుధం*

బుధవారం రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న 200 మంది విద్యార్థులకు 400 పెన్నులు ట్రస్టు నిర్వాహకులు గంజిశెట్టి జగదీశ్వర్( రిటైర్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జయప్రకాశ్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందించడం, మంచి జిపిఏ కనబరిచిన విద్యార్థులకు మెరిటేరియస్ అవార్డ్స్ ఇవ్వడం, డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని టాలెంట్ టెస్టులు నిర్వహించి బహుమతులు అందించడం, అర్ఫన్ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించడం, విద్యార్థులందరికీ డిక్షనరీలు పంపిణీ చేయడం లాంటివి ప్రభుత్వ సెక్టార్ పాఠశాలలో చదివే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ట్రస్టు ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని. అంతేగాక సమాజంలోని ఆర్థికంగా వెనుకబడి చదువులో ముందున్న వారికి అవసరమైన బుక్స్ కొనివ్వడం, పూట గడవని వారికి గాసం అందించడం, వృద్ధాశ్రమాలలో అన్నదానము వస్త్రధానములు చేయడము, ఎండాకాలంలో పని చేసే ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం, రోగస్తులకు ఆర్థిక సహాయం అందించడం, అన్నదానములు చేయడం, లాంటివి అనేక కార్యక్రమాలు ఈ ట్రస్టు ద్వారా సొంత డబ్బులు హెచ్చించి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కే దుర్గాజీ సిహెచ్ వేణు కే శంకర్ కే సత్యం సుధాకర్ అన్నపూర్ణ డి ఉమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment