Site icon PRASHNA AYUDHAM

రక్తం ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాలు

IMG 20250712 WA0054

రక్తం ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాలు

*ప్రశ్న ఆయుధం,జూలై 12 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

* ఇటీవల కాలంలో పెరిగిపోతున్న ఘటనలు

* డబ్బులు ఇచ్చి అల్లాడిపోతున్న బాధితులు

ఓ వైపు ప్రాణం పోతున్న వారు రక్తం కోసం ఎదురు చూస్తుంటే.. ఇదే అవకాశంగా తీసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. మానవత్వానికి మాయనిమచ్చగా మిగులుతూ.. నిలువెల్లా దోపిడీ చేస్తున్నారు. ఫలానా వ్యక్తి ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు.. ఈ గ్రూప్ రక్తం కావాలని రోగి సంబంధీకులు వాట్సాప్ గ్రూపుల్లో రిక్వెస్ట్ లు పెడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఇదే అవకాశంగా, కొందరు ముఠా తాము రక్తదానం ఇస్తామంటూ వారికి ఫోన్ చేసి ఆశపెడుతున్నారు. అయితే, తాము ఊరి నుంచి రావడానికి కారు ఛార్జీలు ఇవ్వాలని కోరుతుండటంతో.. రోగి తరఫు వారు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. అనంతరం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ట్రూ హెల్పింగ్ హాండ్స్ జాయింట్ సెక్రెటరీ బైకానీ శ్రీశైలం యాదవ్, రోహిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపదలో ఉన్నవారిని ఇలా మోసం చేసేవారిపై పీడీ చట్టాలు ప్రయోగించి అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు.

Exit mobile version