తంగళ్ళపల్లి మండలం సారంపల్లి మల్లికార్జున వైన్స్ లో కొంతమంది స్నేహితులతో కలిసి బీర్లు కొనుక్కొని సేవించుతుండగా మరో స్నేహితుడు రావడంతో తను ఓ బీరు కొనుగోలు చేసి ఓపెన్ చేసి చూడగా బీర్ బాటిల్ లో చెత్త వంటి వాటిని చూడడంతో సదురు వ్యక్తి వైన్స్ అతని దగ్గరికి వెళ్లి ఇదేమిటి అని ప్రశ్నించగా మా దగ్గర ఏమీ జరగలేదు బీరు తయారు చేసే కంపెనీ దగ్గర ఏమైనా జరిగితే మా పొరపాటు కాదు అని చెప్పడంతో సదురు వ్యక్తి ఫోను ద్వారాఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి తెలియజేయడంతో చాలాసేపటి తరువాత ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మురళి,కానిస్టేబుల్ నరేందర్ లు వచ్చి వైన్స్ వద్ద తమ వాంగ్మూలం తీసుకొని కల్తీ బీరుతో పాటు మిగతా రెండు బీర్లు తీసుకొని శాంపిల్ ను ల్యాబ్ కు పంపిస్తామని ఫిర్యాదు దారుడు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకోబడునని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అనంతరం ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. ఇలాంటివి జరగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఇలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకొని వైన్స్ లు అన్నిటిపై ప్రత్యేక శ్రద్ధలు వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.