గౌతోజిగూడ నింతులను అరెస్టు చేయాలి…

గౌతోజిగుడ నిందితులను అరెస్ట్ చేయాలి

 

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

 

గజ్వేల్ సెప్టెంబర్ 17 కృష్ణ ఆయుధం :

 

మనోరాబాద్ మండలం గౌతోజిగూడ లో దళిత కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని గజ్వేల్ లో ఏర్పాటు చేసిన ఒక ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం దళిత కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన నిందితులపై కేసు నమోదు చేయాలని డిబిఎఫ్,అంబేడ్కర్ విద్యార్థి సంఘం,మానవ హక్కుల వేదిక చేసిన పోరాటం ఫలితంగా అతికష్టం మీద పోలిసులు నిందుతులపై అట్రాసిటి కేసు నమోదు చేసినప్పటికి కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేయలేదన్నారు.అత్యచార నిరొధక చట్టం ప్రకారం విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలి. కాని వరసగా సెలవు దినాల దృష్ట్య వారిని అరెస్ట్ చేసే అవాకాశమున్న నిందితులు పారారిలో ఉన్నారని ఇంతవరకు అరెస్ట్ చేయకపొవటం అనేది ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరొధక చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.వెంటనే నిందితులను అరెస్టు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మైసయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now