Site icon PRASHNA AYUDHAM

రోడ్డు గుంతలను మరమ్మతు చేసిన బిజెపి నాయకురాలు గాయత్రి

IMG 20240914 WA0069 1

స్వచ్ఛందంగా రోడ్డు గుంతలను కంకరతో మరమ్మతు చేసిన బిజెపి నాయకురాలు బండారి గాయత్రి

కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 14

కరీంనగర్ నగరపాలక సంస్థ 32వ డివిజన్ లో అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు నిర్మాణ మరమ్మతుల కోసం స్థానిక బిజెపి నాయకురాలు బండారి గాయత్రి దేవి, కార్యకర్తలు ముందుకొచ్చి మరమ్మతు చేశారు డివిజన్లో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులతో స్థానిక ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా గుంతల మయంగా మారిన అధికారులు ఎలాంటి చర్యలు చేపటకపోవడంతో బండారు గాయత్రి ఆధ్వర్యంలో స్థానిక బిజెపి కార్యకర్తలు స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. రహదారిపై ఉన్న గుంతలను కాంక్రీట్ డస్ట్ తో మూసివేశారు. ప్రధానంగా సోమవారం రోజున జరిగే వినాయక నిమజ్జనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం తలెత్తకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేశామని గాయత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నాయకులు కార్యకర్తలు తాడూరి కిరణ్ రెడ్డి, శ్రీనివాస్, వినోద్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version