లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత/ కౌసల్య ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలి..

పరీక్షలు
Headlines:
  1. “సిపిఎం దాఖలు చేసిన వినతి పత్రం”
  2. “లింగ నిర్ధారణ పరీక్షలు: చట్ట విరుద్ధంగా జరుగుతున్నది”
  3. “జిల్లా కలెక్టర్ స్పందన కోసం సిపిఎం యోచన”
  4. “అనుమతుల లేమితో ఆసుపత్రులపై చర్యలు”


-జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం కామారెడ్డి జిల్లా కలెక్టర్ నిరంతరం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత/ కౌసల్య శ్రీరామ్ నగర్ కాలనీ ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమన్విత ఆసుపత్రిలో నిరంతరం లింగ నిర్ధారణ పరీక్షలు చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని గతంలో చర్యలు తీసుకుని మళ్లీ ఆసుపత్రి నడపడానికి అనుమతి ఇవ్వడంతో చట్టం పట్ల విలువ గౌరవం అనేది లేకుండా పోయిందని అందుకుగాను చట్టాన్ని గౌరవించని ఈ ఆసుపత్రిని శాశ్వతంగా మూసివేయాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు అలాగే కామారెడ్డి జిల్లాలోని లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా కొనసాగిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలపై ఒక్కసారిగా దాడులు చేసి జిల్లా యంత్రాంగం ఆస్పత్రి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులతోపాటు ఆస్పత్రులను సీజ్ చేయాలన్నారు జిల్లా యంత్రాంగo స్పందించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం ఆధ్వర్యంలో మేమే ఆసుపత్రులపై దాడులు నిర్వహించి తాళం వేస్తామన్నారు. ఈ జిల్లాలో అనుమతులకు అనుగుణంగా లేని ఆస్పత్రిలో అనుమతులను రద్దు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్ మోతిరాం నాయక్ కొత్త నరసింహులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment