గృహ పన్ను ముందస్తు చెల్లింపుతో 5% రిబేటు పొందండి – నాగారం ప్రజలకు కౌకుంట్ల చంద్ర రెడ్డి విజ్ఞప్తి

*గృహ పన్ను ముందస్తు చెల్లింపుతో 5% రిబేటు పొందండి – నాగారం ప్రజలకు కౌకుంట్ల చంద్ర రెడ్డి విజ్ఞప్తి**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15

నాగారం పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గృహ పన్ను (హౌస్ టాక్స్) ను ముందస్తుగా చెల్లించేలా నాగారం మున్సిపల్ ప్రజలకు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా పన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేటు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

పట్టణ అభివృద్ధిలో పన్నుల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే పన్నుతోనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ముందస్తుగా గృహ పన్నును చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.తాను వ్యక్తిగతంగా రూ. 81,024/- ముందస్తు పన్ను చెల్లించి రసీదు తీసుకున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. అభివృద్ధి పథంలో నాగారం ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment