తుపాకితో పట్టుబడ్డ ఘరానా నిందితుడు…

తుపాకితో పట్టుబడ్డ ఘరానా నిందితుడు…

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్:20 నగరంలో ఓ ఘరానా నిందితుడు తుపాకితో పట్టుబడిన ఘటన కలకలం రేపింది. నాందేడ్ కు చెందిన హరి అలియాస్ హరియా అనే నిందితుడు నిజాంబాద్ కి వస్తుండగా.. గురువారం రాత్రి రైల్వేస్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి కంట్రీ మేడ్ తుపాకీ తో పాటు ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. హరి నగరానికి చెందిన బర్షత్ అమీర్ గ్యాంగ్ లో పనిచేసినట్లు సమాచారం. కాగా ఇతడిపై పదుల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి మరోవైపు బర్షత్ అమీర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Join WhatsApp

Join Now