Site icon PRASHNA AYUDHAM

వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం.!!

IMG 20251022 201905

Oplus_16908288

వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం.!!

ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు..!

వరంగల్ జిల్లా:అక్టోబర్ 22

ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులమని నమ్మించి.. వరంగల్ ఆర్టీఏ అధికారుల నుంచి ఏకంగా రూ.10.20 లక్షలు కాజేశారు. దుండగు లు ఇటీవల జరిగిన ఈ ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కొద్ది రోజుల క్రితం వరంగల్ ఆర్డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, అవినీతికి సంబంధించిన కొన్ని అంశాలను గుర్తించారు. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న కేటుగాళ్లు.. హలో నేను ఏసీబీ డిఎస్పి ని మాట్లాడుతున్నా. మీరు లంచం బాగా తీసుకుంటు న్నరట మీ మీద మాకు ఫిర్యాదు వచ్చింది సెటిల్మెంట్ చేసుకోండి అర్జెంటుగా డబ్బులు ఆన్లైన్లో అకౌంట్ కు పంపించండి అంటూ ఓ అగంతకుడు వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికారు లకు ఫోన్లు చేశాడు.

అవినీతి కేసులో అరెస్టు కాకుండా ఉండాలంటే.. తాము అడిగినంత డబ్బు చెల్లించాలని ఆర్టీఏ అధికా రులను బెదిరించారు. ఆందోళన చెందిన ఆర్టీఏ అధికారులు .. దుండగు లకు దశలవారీగా రూ.10. 20 లక్షలు చెల్లించారు. దుండగులతో ఫోన్‌లో మాట్లాడుతున్న క్రమంలో ఒక ఆర్టీఏ అధికారికి అనుమానం వచ్చింది.

దీంతో వారు నేరుగా అసలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు చేసిన విచారణ ద్వారా.. తాము నకిలీ అధికారుల బారిన పడి మోసపోయామని సదరు ఆర్టీఏ అధికారులు గ్రహించారు. అనంతరం మోసగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ తరహా మోసాలు కేవలం ఆర్టీఏ అధికారులకే పరిమి తం కాలేదు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతి కతను ఉపయోగించి ఉద్యోగులను, సామాన్య ప్రజలను మోసం చేస్తున్నా రు. ఉన్నతాధికారులు లేదా మంత్రుల వాయిస్‌ను ఏఐ ద్వారా సృష్టించి అత్యవ సరంగా డబ్బులు అడుగుతున్నారు.

బ్యాంక్ ఉద్యోగులు లేదా టెలికాం ఆపరేటర్లమని చెప్పి కేవైసీ అప్‌డేట్ పేరుతో ఓటీపీలు అడిగి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు మోసపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారు లు చెబుతున్నారు.

ఏసీబీ, పోలీస్ లేదా ఆదాయపు పన్ను శాఖ ఐటీ వంటి అధికారిక ఏజెన్సీల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లయితే ముందుగా ఆ అధికారి వివరాలు తీసుకొని ఆ శాఖ అధికారిక కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలి. అధికారిక విచారణలు లేదా ప్రభుత్వ లావాదేవీల కోసం అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బును లేదా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని అడగరు.

డబ్బు అడిగితే అది మోసమేనని అనుమానిం చాలి. ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ లేదా ఆధార్ నంబర్‌ను చెప్పవద్దు. ఏదైనా కాల్ లేదా మెసేజ్ అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చెయ్యండి.

Exit mobile version