గజ్వేల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి

గజ్వేల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి

  • – జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు 
  • – జర్నలిస్ట్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించాలి 
  • – జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యను అందించాలి 
  • – రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు మద్దతుగా టీజేయు ఉంటుంది 
  • – తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి

ప్రశ్న ఆయుధం : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంగళవారం రోజు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గజ్వేల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, జర్నలిస్టుల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించాలని వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, రాష్ట్రంలో ప్రతి జర్నలిస్టుకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఉంటుందని, రాష్ట్రంలో చిన్న పత్రిక నుంచి మొదలు పెడితే పెద్ద పత్రిక వరకు ఏ ఒక్క జర్నలిస్ట్ కైనా సమస్య వస్తే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమస్యను పరిష్కరించే దిశగా ముందుంటారని గుర్తు చేస్తున్నామన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి మాట్లాడుతూ గజ్వేల్ లో పనిచేస్తున్న విలేకరులకు జర్నలిస్ట్ కాలనీలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని ఇతర యూనియన్ లో పనిచేస్తున్న జర్నలిస్టులు అడ్డుకోవడం విచిత్రంగా ఉందన్నారు. జర్నలిస్టుకు సమస్య వస్తే ప్రశ్నించాల్సింది పోయి వారే అడ్డుకోవడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయం పై రాష్ట్ర అధ్యక్షులు,  ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, త్వరలో జర్నలిస్టు ఇళ్ల స్థలాల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గజ్వేల్ జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ చారి, సిద్దిపేట జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు గుడాల చంద్రశేఖర్ గుప్తా, ఎల్లం రాజ్, మహేష్, బైరి ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment