గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాభివృద్ధి సహకరించాలి

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణాభివృద్ధి సహకరించాలి – కమిషనర్ గోల్కొండ నరసయ్య

గజ్వేల్, 12 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను నల్ల బిల్లు ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలని కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పన్నుల వసూలులో భాగంగా గృహ మరియు వాణిజ్య సముదాయాల మొండి బకాయిలు పద్దులను కట్టించడం జరిగిందన్నారు అలాగే వ్యాపార లైసెన్స్ అనుమతులు లేకుండా ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను పరిశీలించి ట్రేడ్ లైసెన్స్ పన్నులు విధించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు ఇంటి పన్నులు నల్ల బిల్లులు మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now