కబ్జాకు గురవుతున్న గజ్యా నాయక్ తండ అంగడి బజార్
కామారెడ్డి మార్చి 2.
మాచారెడ్డి మండల కేంద్రం గాజ్య నాయక్ తండ అంగడి బజార్ లోని రోజు రోజుకు కబ్జాకు గురవుతుందని మాజీ ఉప సర్పంచ్ తోకల కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. అంగడి బజార్లో వారి పర్మిషన్ వరకు ఇల్లు కట్టుకొని రోడ్డుమీదికి రేకుల షెడ్డు వేసుకొని కబ్జాకు గురి చేసుకుంటున్నారని గ్రామ సెక్రెటరీ మరియు స్పెషల్ ఆఫీసర్ కు తెలిపిన పట్టించుకోవడంలేదని తోకల కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రేకుల షెడ్లు తీసి వేయని యెడల ప్రజావాణికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.