ల్యాబ్ టెస్ట్ కు యాదాద్రిలో వాడే నెయ్యి

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్ లోని ఓ ల్యాబ్ కు పంపారు. మదర్ డెయిరీ ఈ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. గుడిలో అమ్మే లడ్డూ, పులిహోర నాణ్యతపైనా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now