Headlines :
-
గిద్దలూరు హాస్టల్ లో జడ్జి ఆగ్రహం: “విచిత్ర పరిస్థితి!”
-
గిద్దలూరు హాస్టల్ పరిశీలన: జడ్జి ఏ.ఓంకార్ సిబ్బందిపై ఆగ్రహం
-
“ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్తు కావాలి” – జడ్జి విద్యార్థులతో మాట్లాడిన అంశం
-
గిద్దలూరు హాస్టల్ లో అసౌకర్యాలు, జడ్జి ఆగ్రహం, డ్రైనేజీ సమస్య
-
హాస్టల్ సిబ్బందికి జడ్జి హెచ్చరిక: “శ్రద్ధతో పని చేయండి!”
గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి ఏ .ఓంకార్ గిద్దలూరు లోని కోట గడ్డ వీధి పోలీస్ స్టేషన్ బజార్ లో ఉన్న ప్రభుత్వ బి.సి.బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు .హాస్టల్లో పగలు వాచ్ ఉమెన్ లేకపోవడం పట్ల మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులు హాస్టల్ లోకి చొరబడితే పరిస్థితి ఏమిటని తర్వాత వచ్చిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ను జడ్జి ప్రశ్నించారు. ఆడపిల్లల హాస్టల్ చాలా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. డ్యూటీ సమయంలో వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళకూడదని అన్నారు. శ్రద్ధగా డ్యూటీలను చేసుకోవాలన్నారు. తనిఖీ సమయంలో హాస్టల్లో సుమారు 70 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత పిల్లలతో మాట్లాడిన న్యాయమూర్తి వారు భవిష్యత్తులో ఏమి కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. గవర్నమెంట్ వారు అందిస్తున్న సహాయ సహకారములు మరియు వసతులను సక్రమంగా వినియోగించుకొని మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని, అందుకు తగిన శ్రద్ధను చదువుపై చూపించాలని గురువులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారికి దిశా నిర్దేశం చేశారు. న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 15100 గురించి వివరించారు. వారికి అందుతున్న ఆహారము, వసతి సౌకర్యములను అడిగి తెలుసుకున్న న్యాయమూర్తి డ్రైనేజీ వాటర్ సరిగా లేకపోవడం,వాన నీరు హాస్టల్లోకి వస్తున్నదని జడ్జి ఆగ్రహించారు.ప్రహరి గోడ చాలా వరకు దెబ్బ తిన్నదని మరియు ప్రహరి గోడ పై పెట్టిన ఇనుప ఫెన్సింగ్ పాడై పోయిందని ప్రత్యక్షంగా చూశారు.