అలుపెరుగని పోరాటం తరువాత మోకపై గిరిధావర్ (Ri) విచారణ
దినిని బట్టి చూస్తే ఈ సమస్య తుదకు చేరినట్టే
తనుగుల గ్రామ దళిత కాలనీ వాసులు వెల్లడి
తొందరగా కాలనీ పేరు మీద పట్టా చేయాలాని కాలనీ వాసుల విజ్ఞప్తి
జమ్మికుంట అక్టోబర్ 25 ప్రశ్న ఆయుధం
ధరణి రాకతో దళితుల భూమి అక్రమానికి గురై దాంతో
అలుపెరుగక గత రెండు సంవత్సరాల నుండి పోరాడుతున్నా
పోరాటం దాదాపు తుదకు చేరినట్టేనని,కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం,తనుగుల గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా అంబాల రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ…. ధరణి రాకతో సర్వేనెంబర్ 169/a లో ఉన్న 2.31 గుంటల తమ ఇడ్ల స్థలాల భూమిని అప్పటి బి ఆర్ ఎస్ నాయకుల ప్రోత్బలంతో తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నర్సయ్య కు అక్రమంగా పట్టా చేయించారన్నారని దీనిని తాము గమంచి,ఈ సమస్య పరిష్కారానికై అప్పటి నుండి ఇప్పటికి వరకు అలుపెరుగక పోరాడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చి,
భూ భారతి పోర్టల్ ను ప్రవేశ ప్రవేశపెట్టారన్నారు.
అందులోనే సాదాబై నామాల పరిష్కారం కూడా భూభారతిలో పరిష్కారం చేస్తామని చెప్పడంతో తమకెంతో
ఉత్సాహం వచ్చిందన్నారు.దాంతో తాము తమ భూ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, నేడు జమ్మికుంట మండల ఎమ్మార్వో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు మోకపై,గిరిధావర్ (Ri) వచ్చి విచారణ చేశారన్నారు.కాగా దినిని బట్టి చూస్తే దాదాపు ఈ సమస్య తుదకు చేరినట్టేనని ఇంకా తొందరగా,తమ కాలనీ పేరు మీద ఇండ్ల స్థలాల భూమిని పట్టా చేయాలాని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.