Site icon PRASHNA AYUDHAM

గిరి వెలుగు అవినీతిపై చర్యలెందుకు తీసుకోరు…?!

IMG 20250630 WA0013

*గిరి వెలుగు అవినీతిపై చర్యలెందుకు తీసుకోరు…?!*

*దర్యాప్తులో దాగుడుమూతలు ఎందుకు…?

*వన్ దన్ వికాస కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కమిషన్ నిధులు దుర్వినియోగం మాటేమిటి…?*

*చింతపండు కేక్ తయారీ యంత్రాలు ఎక్కడ…?

*త్రీఫేజ్ లేకుండా కొనుగోలు చేసిన యంత్రాల పరిస్థితి ఏంటి…?*

*ఎందరు ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోరు…?

*అవినీతికి కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతీ పురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 30( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గల గిరి వెలుగులో ఆరోపణలు వినిపిస్తున్న అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోరని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, తీళ్ళ గౌరీ శంకరరావు, జిల్లా నాయకులు పాలక్ రంజిత్ కుమార్ తదితరులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికతో ఐటీడీఏ గిరి వెలుగులో వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు బాధ్యులైన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన్ ధన్ వికాస కేంద్రాల నిధులు, ధాన్యం కొనుగోలు కమిషన్ నిధులు దుర్వినియోగంపై అప్పట్లో గిరి వెలుగు ఏపీ డి పై వచ్చిన ఆరోపణలపై పలువురు ఫిర్యాదులు చేసిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గిరి వెలుగు /వెలుగు ఏపీ డి, పి డి గా పనిచేసిన అధికారిపై పలు ప్రజా సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 8 చింతపండు కేక్ తయారీ యంత్రాలు ఎక్కడ ఎప్పుడు అమర్చారని ప్రశ్నించారు. ప్రస్తుతం వాటి పరిస్థితి పై విచారణ జరిపించాలన్నారు. వీడి వీకేల ద్వారా అటవీ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు కొరకు 11 వీడీవీకేలకు గాను ఫిబ్రవరి 2022లో ఇచ్చిన సుమారు రూ. 19 లక్షలు, మండల సమాఖ్యల ద్వారా తీసుకున్న అడ్వాన్సులతో వ్యాపారం వాటి లాభాలపై దర్యాప్తు చేయాలన్నారు. డిపిఆర్లు లేకుండా ఎటువంటి ఫీల్డ్ అరేంజ్మెంట్స్ లేకుండా త్రీ ఫేస్ కరెంటుతో నడిచే రెండు పసుపు తయారీ యంత్రాలు, రెండు పప్పులు, చిరుధాన్యాలు తయారీ యంత్రాలను కొనుగోలు చేసి వృధాగా డీఆర్డీఏ కార్యాలయం వద్ద గత మూడేళ్లుగా పడేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. అందులో ఒక యంత్రం కురుపాంలో నిరుపయోగంగా ఉన్న పరిస్థితిపై దర్యాప్తు చేయాలన్నారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావిడిగా ఆ యంత్రాలు కొనుగోలులో మర్మమేంటని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోరన్నారు. కొండ చీపురులు కటింగ్ మిషన్లు కొనుగోలు వలన వనగూరిన ప్రయోజనమేంటో దర్యాప్తు చేయాలన్నారు. అగరబత్తీల తయారీ శిక్షణలో జరిగిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్నారు. వీడి వీకలా నిధుల మళ్లింపు పై దర్యాప్తు చేయాలన్నారు. ఎఫ్ పి ఓ నిధులనుండి వీడియో కొరకు అడ్వాన్స్ రూపంలో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిధులపై దర్యాప్తు చేయాలన్నారు. అలాగే పాడేరు నుండి తెప్పించిన పసుపు పై దర్యాప్తు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కమిషన్ నిధులలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నతి మరియు పీఎం అజయ్ లోన్లు రికవరీ పై సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మనసేవ కేంద్రాలకు సంబంధించి లాప్టాప్లు కుటుంబాలకు వాడుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. విడివికేల ద్వారా కొన్న యంత్రాలు పనితీరు పరిశీలించుకున్నానే చెల్లింపులు చేయడంలో ఆంతర్యమేమని ప్రశ్నించారు. సంబంధిత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దర్యాప్తు చేస్తున్నామంటున్నారే తప్ప చర్యలు కనిపించడం లేదన్నారు. తక్షణమే గిరి వెలుగు అవినీతిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version