దేశంలో అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు.
జమ్ముకశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కూడా రాఖీ సంబరాలు జరిగాయి. సుచేత్గఢ్ ఏరియాలోని సరిహద్దు గ్రామాలకు చెందిన బాలికలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లకు రాఖీలు కట్టారు. వారితో జవాన్లు సంతోషంగా రాఖీలు కట్టించుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.