*తాడిచెట్టు పై నుండి అదుపుతప్పి కింద పడి గీతా కార్మికులకి తీవ్ర గాయాలు*
*జమ్మికుంట అక్టోబర్ 9 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లోని మాచనపల్లి గ్రామానికి చెందిన బండి రవి వృత్తి రీత్యా గీత కార్మికుడు. రోజువారి వృత్తిలో భాగంగా ఎడ్లపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పై నుండి కింద పడగా స్థానికులు గమనించి వెంటనే జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.రమేష్ ను పరీక్షించిన వైద్యులు ఎడమకాలు విరిగిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారని తెలిపారు.నిరుపేద కుటుంబానికి చెందిన బండి రమేష్ ను ఆదుకోవాలని గౌడ సంఘం నాయకులు పూదరి శ్రీనివాస్, చంద్రమౌళి, తదితరులు ప్రభుత్వాన్ని గౌడ కార్పొరేషన్ ను కోరారు.