బీర్కూర్ మండల కేంద్రంలో బీరప్ప మందిరం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని మల్లన్న గొర్రెల, మేకల సహకార సంఘం నాయకులు గురువారం మండల తహసీల్దార్ సాయిభుజంగరావును కోరారు. ఈ సందర్బంగా వారు తహసీల్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాకు బీరప్ప మందిరం ఊరికి ” 3 కి.మీ. దూరం పొలాల్లో ఉందని, మాకు పండగ నిర్వహించడానికి కాలినడకన వెళ్ళ వలసి వస్తుందన్నారు. ఆ మందిరానికి రోడ్డు మార్గం కూడా లేదని, పిల్లలకు, పెద్దలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని కావున తమకు మందిరం నిర్మాణం కోసం ఊరికి దగ్గరగా రోడ్డు మార్గం ఉండే విధంగా స్థలం కేటాయించాలని, గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇప్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు బాన్సువాడ బీరుగొండ, బాన్సువాడ గంగాధర్, బోధన్ పీరుగొండ, మేత్రి నాగేష్, మేత్రి పీరుగొండ తదితరులు పాల్గొన్నారు.