చెరువు భూ ఆక్రమణదారుల సమాచారం అధికారులకు ఇవ్వండి

*చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి- ప్రకృతి పరిరక్షణకు ముందుకు రండి*
*ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు*

*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 25*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామాలలో చెరువుల ఆక్రమణ పై సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రామారావు పిలుపునిచ్చారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని చెరువుల ఆక్రమణ పై అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు సమాజంలో మన బాధ్యతగా ముందుగా చెరువు కుంటల విస్తీర్ణం తెలుసుకోవాలని చెరువులు కుంటలు ఆక్రమణకు గురి అయితే దానికి సంబంధించిన అధికారులకు సమాచారం తెలియజేయాలని అన్నారు వాటి వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని తెలియజేస్తే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సూచించారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించదని ఇది వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం ఎంత మాత్రం కాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య అని ప్రజాపాలనలో తీసుకున్న సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు చెరువులను కాపాడండి భావితరాలకు బంగారు బాటలు వేయండి అని మీ గ్రామాల్లోని చెరువుల్లో నీరు నిలువ ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉంటుందన్నారు చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు.ఈ రోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని అన్నారు.

Join WhatsApp

Join Now