నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి జనవరి 20:
ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన మిద్దె సందీప్ అనే యువకుడు గ్రామానికి స్వర్గ రదాన్ని విరాళంగా అందజేశారు. యువకుడి నానమ్మ కీ. శే మిద్దె గురమ్మ తాతయ్య కీ. శే మిద్దె లింగన్న ల జ్ఞాపకార్ధం తన సొంత ఖర్చు రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు వెచ్చించి స్వర్గ రధం తయారు చేయించారు. తాను పుట్టి పెరిగిన గ్రామానికి తన సంపాదనతో గ్రామ ప్రజల సౌకర్యర్థం స్వర్గ రధం అందించడం ఎంతో సంతోషకరమైన విషయమని సందీప్ తండ్రి మిద్దె నరేందర్ అన్నారు. ప్రతి ఒక్క యువకుడు సైతం తమ తమ గ్రామాలకు తనవంతు సహాయ సహకారలు అందించాలని కోరారు. అనంతరం మిద్దె సందీప్ తో పాటు అతని తండ్రి నరేందర్ ను గ్రామ పెద్దలు యువకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఈ. ప్రేమ్ దాస్ నాయక్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రాతినిధులు పాల్గొన్నారు.