ముందుకు సాగండి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు..

గౌడు ఐక్యతకై ముందుకు సాగండి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్..

IMG 20240922 WA0011 scaled

IMG 20240922 WA0012 scaled

 తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కత్తి నెహ్రూ గౌడ్ అధ్యక్షతన ఎన్ ఎస్ టి రోడ్ నిర్మల హృదయ స్కూల్ పక్కన కత్రి నెహ్రూ రెసిడెన్సులో జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో పల్లె లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో హాస్టల్స్ నిర్మించడం జరుగుతుంది . ఆ హాస్టల్ లోని పేద విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు . గీతా కార్మికులకు సేఫ్టీ మొక్కులు 33 జిల్లాలలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు . అలాగే జలగం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గౌడ జాతి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గా నియామకం కావడం గౌడులకు గర్వదాయకం మరియు శుభపరిణామం అని అన్నారు . ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారిని మరియు యువ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ రవాణా శాఖ మంత్రివర్యులని తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించాలని తీర్మానించారు . ఖమ్మం నగరంలోని రఘునాధపాలెం లో 3600 గజాలస్థలం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంజూరు అయింది . ఆ స్థలంలో గౌడులందరూ ఐకమత్యంతో గౌడ పేద విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మించాలని దానికి రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం కూడా తమ వంతుగా ఆర్థిక సహకారం చేస్తుందని అన్నారు . గౌడ సంఘం రాష్ట్ర సీనియర్ కార్యదర్శి చింతలపాటి వెంకటేశ్వరరావు గౌడ్ , ఉపాధ్యక్షుడు బద్దం ధనుంజయ గౌడ్ , కళ్యాణ్ గౌడ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ , తెలంగాణ మహిళా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డమీది అనురాధ గౌడ్ , ప్రజ్వల గౌడ్ , రాష్ట్రమహిళా వైస్ ప్రసిడెంట్ శైలజా గౌడ్ , వైస్ ప్రసిడెంట్ పంజాల రాజకుమారి గౌడ్ , జాయింట్ సెక్రటరీ పాల్గొన్నారు . ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి నూతన నియామకాలు ఇవ్వడం జరిగింది . జిల్లా గౌరవ అధ్యక్షులుగా శ్రీ చిత్తలూరి నర్సయ్య గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శిగా మార్గం లింగయ్య గౌడ్ , జిల్లా కార్యదర్శులుగా వెంకట నరసయ్య గౌడ్ , కార్యదర్శి లు మెరువ వినోద్ గౌడ్ , రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కత్తి విజయ్ కుమార్ గౌడ్ లను నియమించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది . ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ , కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు బోడపట్ల సుదర్శన్ గౌడ్ , కాంగ్రెస్ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కా శేఖర్ గౌడ్ పాల్గొన్నారు . సమావేశం అనంతరం బల్లేపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయానికి సందర్శించడం జరిగింది స్థానిక గౌడ సంఘ నేతలు కట్టెకోల వెంకన్న గౌడ్ , బోడపట్ల నాగేశ్వరరావు గౌడ్ , బత్తిని ఉపేందర్ గౌడ్ , చిర్ర రాజు గౌడ్ మరియు మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు . దేవాలయంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణ్ గౌడ్ ను ఘనంగా సన్మానించడం జరిగింది . వారితోపాటు మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్ మరియు వారి రాష్ట్ర కార్యవర్గాన్ని , ఖమ్మం జిల్లా కమిటీ శ్రీ కత్తి నెహ్రు గౌడ్ , శ్రీమతి కత్తి విజయ్ కుమారి గౌడ్ , శ్రీ మార్కం లింగయ్య గౌడ్ , శ్రీ వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ లను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది .

Join WhatsApp

Join Now