ప్రతి రైతు వద్దకు వెళ్లండి: హరీశ్, కేటీఆర్ లపై రేవంత్ సెటైర్..

ప్రతి రైతు వద్దకు వెళ్లండి: హరీశ్, కేటీఆర్ లపై రేవంత్ సెటైర్..

IMG 20240828 WA0095

రెండు లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుందని సీఎం చెప్పారు. వాటికి నిధులు కూడా విడుదల చేశామని తెలిపారు. కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ నేతలు అందరికీ రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా స్పందించిన సీఎం రేవంత్.. హరీష్ రావు, కకేటీఆర్ ప్రతి రైతు వద్దకి వెళ్లండి.. రుణమాఫీ అవ్వని లెక్కలు సేకరించి కలెక్టర్ ఇవ్వండి.. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని సెటైర్ వేశారు.కాగా..ఎన్నికల సమయంలో ఇచ్చి మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని జూల 18 నుంచి ప్రారంభించింది. ఆగస్టు 15వ వరకు మూడు విడతలుగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే, రుణమాఫీ కాని వారు ఆందోళన చెందొద్దని.. అందరికీ మాఫీ చేస్తామని సీఎం, మంత్రులు తెలిపారు.

Join WhatsApp

Join Now