ఘనంగా గోదా రంగనాథుని పూజ

ఘనంగా గోదా రంగనాథుని పూజ

గజ్వేల్, 13 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బోడ బాలకిషన్ మంజుల స్వగృహంలో గోదా రంగనాథుల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యుల బృందంచే  ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ చింతనతో ధర్మం వైపు ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు  ఒత్తిడితో ఉన్న ఈ రోజుల్లో దైవచింతన తో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక దృఢత్వంతో పాటు అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి , భాను ప్రకాష్ ,శ్రీకాంత్, దీప, భవాని, రమేష్ ,ప్రేమలత ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now