భరత్ నగర్ కాలనీ లో కన్నుల పండుగలా గోదాదేవి కళ్యాణం
ప్రశ్న ఆయుధం జనవరి 13: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం గోదావరి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నాగిరెడ్డి, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు కళ్యాణం సందర్భంగా దేవేరులను, పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు కళ్యాణo అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో తూము వేణు కుక్కల రమేష్, తూము సంతోష్ ,రాజ్ పటేల్, బాల నరసింహ ,కిట్టు ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.