Site icon PRASHNA AYUDHAM

బీజేపీ సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించిన గోదావరి అంజిరెడ్డి

IMG 20251219 204241

Oplus_16908288

సంగారెడ్డి, డిసెంబర్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జ్ పి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించారు. అలాగే ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులకు కూడా బీజేపీ జిల్లా పార్టీ సంపూర్ణ నైతిక మద్దతుతో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర, మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version