ఉగ్రరూపం దాల్చిన గోదావరి…
@ ఘట్ల పైకి వరద నీరు…
@ ప్రమాద స్థాయిని దాటె అవకాశం
ప్రశ్న ఆయుధం..బాసర:
ఎగువన ఎడతెరిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పిండ ప్రధాన షెడ్డు వరదలతో మునిగిపోయింది. బాసర చరిత్రలో మొదటి సారి1983లో వచ్చిన భారీ నుంచి అతి భారీ వర్షాల, వరదల కారణంగా గోదావరి ఘాట్లు మునిగినట్లు చరిత్ర కారుకు చెబుతుండగా అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని అంటున్నారు.. గోదావరి ఇప్పటికే బ్యాక్ వాటర్ కారణంగా బాసర లో పాలు కాలనీలు మునిగిపోయాయి. గత: అర్ధ రాత్రి లోతట్టు ప్రాంతమైన హరిహర కాటేజ్ లో వరదలో చిక్కుకున్న పది మందిని సంబంధిత అధికారులు గ్రామస్తులు బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగటానికి ఒక మెట్టు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బాసర, చుట్టూ ప్రక్కల ప్రజలు గోదావరి వరదను చూడటానికి తరలివస్తున్నారు.