నీటి పారుదల శాఖ, జల మండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు..

నీటి
Headlines
  1. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాల ప్రణాళిక
  2. 20 టీఎంసీ గోదావరి నీటికి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్
  3. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ నుంచి నీటిని తరలించేందుకు ప్రణాళిక
  4. జల మండలి సమావేశంలో నీటి ప్రాజెక్టులపై సమీక్ష
  5. మిషన్ భగీరథతో సమన్వయం చేసేందుకు అధికారుల ఆదేశాలు
*తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగు నీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలని చెప్పారు..*

* జంట నగరాల తాగు నీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు అంశంపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ, జల మండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు..

* హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత మేరకు నీటిని తరలించాలి, ఎంత ఖర్చవుతుందన్న విషయాలపై పూర్తి అధ్యయనం జరగాలని ఆదేశించారు.

* ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పారు..

Join WhatsApp

Join Now