*గోదావరిఖని: భార్యపై భర్త దాడి.. చికిత్స పొందుతూ మృతి*
గోదావరిఖనికి చెందిన ఆవుల గట్టయ్య (హోంగార్డు) తన భార్య రామలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రామలక్ష్మి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించింది.
గట్టయ్యకు ఉన్న వివాహేతర సంబంధం విషయంలో నిత్యం రామలక్ష్మిని వేధించేవాడు.
ఈ విషయంలో నిలదీసిన భార్యను ఆగ్రహంతో గొంతు నులిమి దాడి చేసి గాయపరిచాడు.
ఘటనపై వన్ టౌన్ సీఐ రవీందర్ నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపారు.