కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు
ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థ అల్లీపూరం కొత్తగూడెంలో సిపిఐ కార్యాలయం ఎదుట దసరా పండుగ సందర్భంగా కొనసాగుతున్న దేవి నవరాత్రులు పురష్కరించుకుని కొత్తగూడెం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దుర్గా మాత అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించాలని పూజలు నిర్వహించారు. కొత్తగూడెంలో గత ఇరవై సంవత్సరాలుగా దేవి నవరాత్రులు, బతుకమ్మ, సంక్రాంతి ముగ్గుల పోటీలు, క్రీకెట్, కబాడి తదితర ఆటల పోటీలు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తెలిపారు. కుంకుమ పూజ సామాగ్రి దాతలు భూమా సాయిచందు, తోట నవీన్, ఉపెందర్, కార్యక్రమం అమరారపు యశ్వంత్, లక్కా రోహిత్, దంతాల శ్రీకాంత్, షేక్ మాబు, భూమా రాంమూర్తి, కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తుపాకుల పేరమ్మ, మాకనబోయిన పార్వతి, అమరారపు వెంకటమ్మ,లక్కా రేణుక, సీతం రమాదేవి, రామాంజం లాలమ్మ, యం. త్రివేణి, పగడాల నాగమణి తదితరులు పాల్గొన్నారు.