యువజన కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా గొడుగు మానస

యువజన
Headlines :
  1. “గొడుగు మానస యువజన కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా ఎన్నిక”
  2. “గొడుగు మానస: నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు”
  3. “యువజన కాంగ్రెస్ అభివృద్ధికి, నిరుద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తా”
  4. “హుజురాబాద్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా గొడుగు మానస ఎంపిక”
  5. “గొడుగు మానస: ప్రతి పనిలో యువతకు ఆదర్శంగా నిలుస్తా”

ఇల్లందకుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇల్లందకుంట మండలం శ్రీరాముల పల్లి గ్రామానికి చెందిన గొడుగు మానస యువజన కాంగ్రెస్ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగాఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గొడుగు మానస మాట్లాడుతూ నన్ను నమ్మి యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ

 నమ్మకం ఉంచి నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరితో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నీతి నిజాయితీతో పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి యువజన కాంగ్రెస్ చేపట్టే ప్రతి పనిలో ముందుండి యువతకు ఆదర్శంగా నిలుస్తానని ప్రతి ఒక్క నిరుద్యోగి పట్ల నా వంతు కృషి చేస్తూ యువతను మంచి దారిలో నడిపిస్తూ వారికి అండగా ఉంటూ ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ ప్రతి పనిలో సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పెద్దల సహకారంతో ప్రతి పనిలో ముందుండి పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు..

Join WhatsApp

Join Now