బీసీ అతిథి గురుకుల అధ్యాపకుల గోడు పట్టదా?
సమస్యలు తీర్చాలని వినతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ హాస్టళ్ళు,గురుకుల దుస్థితి మరింత దారునంగా ఉందని, శుక్రవారం అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని,అధిక పని భారం ఉన్న, ఏడు సంవత్సరాల సీనియార్టీ కలిగిన ఉపాధ్యాయులను సైతం విధుల నుండి తొలగించడం పై పలు విమర్శలు వస్తున్నాయి. అతిధి ఉపాద్యాయులను ఆ కారణంగా బయటకు పంపించడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని గురుకులాలు ఆ ఉత్తర్వులు పెడచెవిన పెట్టి, విధులకు హాజరు కానివ్వడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై చర్యలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్ట్ ను కోరారు.అన్ని సొసైటీలో ఏకరూప పరిపాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకులంలో అతిథి ఆధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిచో ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో శ్రీనివాస్,రంజిత్, శ్రీకాంత్, రాజశేఖర్, ప్రశాంత్,సంతోష్, సంధ్య,లలిత, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.