జాతీయస్థాయి రోల్ ప్లే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దేవునిపల్లి విద్యార్థులు

జాతీయస్థాయి రోల్ ప్లే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దేవునిపల్లి విద్యార్థులు

ప్రశ్న ఆయుధం, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థులు సానియా, రేణుక, హర్షవర్ధన్, నాని, విక్టర్ పాల్ లు గైడ్ టీచర్ భవాని, ఎస్కార్ట్ టీచర్ రమేష్ లతో కూడిన తెలంగాణ టీంను, మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జాతీయస్థాయిలో ఈనెల 5 నుండి 8 వరకు నిర్వహించబడిన రోల్ ప్లే పోటీలో మత్తుపదార్థ దుర్వినియోగం, దాని కారణాలు నివారణ అనే అంశంలో ఉత్తమ ప్రదర్శన చేసినందున నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) వారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాకిషన్ తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, గైడ్ టీచర్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, జంగం శ్రీశైలం, సాయిలు, నవీన్, ప్రభులింగం, అశోక్, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now