“గోల్ మాల్ గోవిందం”…!!

 

*గాడి తప్పుతున్న గ్రామపంచాయతీల పాలన*

*దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ఆలోచనలో పంచాయతీ కార్యదర్శులు*

*ప్రజల సొమ్ము కాజేస్తున్న ఎంపిఓ వెంకటేశ్వర్లు*

*నీకెంత నాకెంత భేరసారాలు కుదుర్చుకుంటున్న అధికార ఘనం*
*గడ్డివానిపల్లి గ్రామ పంచాయతీలో 81.389 రూపాయల నిధుల స్వాహా చేసిన గణాపాటీలు*

*స్వాహా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు*

* జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 27*

నాయకుడు లేని జెండా నవాబు లేని తండాగా తయారవుతుంది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని గ్రామపంచాయతీల పరిపాలన వ్యవస్థ సర్పంచుల పదవీకాలం పూర్తయి తరువాత రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులను నియమించడం విధితమే గ్రామాలలో సర్పంచ్ వ్యవస్థ పూర్తయి ఆరు నెలల కాలం గడుస్తున్న మమ్మల్ని అడిగేవారు ఎవరు అనుకున్నారో ఏమో ఇల్లందకుంట మండలంలో గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తన కిందిస్థాయి అధికారులతో అదుపులో పెట్టుకొని అందిన కాడికి దోచుకుంటూ తన చేతివాటాన్ని ప్రదర్శించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు తన కింది స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏం చేసినా ఎలా చేసినా డబ్బులు మాత్రం నాకు చేరాలంటూ కిందిస్థాయి అధికారులను తప్పుడు మార్గంలో నెట్టుతో డబ్బులు కాజేస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు గ్రామ పంచాయతీల పాలన గాడి తప్పుతోందని దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు కార్యదర్శులు ప్రజల సొమ్మును కాజేస్తున్న పట్టించుకోని పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని గ్రామ అభివృద్ధి కోసం పని చేయవలసిన కార్యదర్శి గ్రామ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న ఎంపీవో వెంకటేశ్వర్లు కార్యదర్శి సహకారంతో మామూళ్ల మత్తులో నీకో సగం నాకో సగం అనే రీతిలో అక్రమంగా నిధులు కాజేశారనేది ఆరోపణ
అక్రమార్కులకు అధికారుల అండదండలు, ప్రభుత్వ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నిధుల దుర్వినియోగం సాఫీగా సాగుతుందని ఇల్లందకుంట మండల పరిధిలోని గడ్డివానిపల్లి లో గతంలో ఇక్కడ పనిచేసిన మహిళ కార్యదర్శి తన భర్త తంగళ్ళపల్లి వెంకటేశ్వర చారి పేరు పై చెక్కు ను జారిచేసి ఎంపీవో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

*నిధుల స్వాహా*

19.07.24 రోజు 15 ఫైనాన్స్ నుండి జీపీ బిల్డింగ్ రిపేర్ పేరేట MB NO 21847AK4719 పై రూ.81.839 రూపాయలు కార్యదర్శి భర్త తంగళ్ళపల్లి వెంకటేశ్వర చారి పేరు పై డబ్బులు డ్రా చేశారు గ్రామంలో పని చేయించని వారిపై మరికొన్ని బిల్లులు కూడా కార్యదర్శి కుటుంబీకుల పేరు పై చెక్కులు జారీ చేసి డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సహకరించిన స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ముఖ్యుడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు

*విచారణ చేసి చర్యలు తీసుకుంటాం*

*పుల్లయ్య, ఎంపీడీవో ఇల్లందకుంట*

గడ్డివానిపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై మా దృష్టికి రాలేదు రుజువైతే బాధ్యుల నుంచి రికవరీ చేస్తాం. కారకులపై చర్యలూ తీసుకుంటాం అవినీతి ఎలా చేశారో విచారణలో తేల్చి స్వాహా చేశారని తేలితే బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటాం అని అన్నారు

Join WhatsApp

Join Now