నవ వధువు వివాహానికి పుస్తె, మట్టెలు అందజేసిన గోలి సంతోష్
*గజ్వేల్ , జనవరి 27,
నవ వధువు వివాహానికి పుస్తె, మట్టెలు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన నవవధువు శివాని వివాహానికి పుస్తె, మట్టెలు చీర సాసారెను గోలి మమత సంతోష్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని, నా వంతుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు. బర్రెంకల కిష్టవ్వ-కీర్తిశేషులు రాములు కుమార్తె శివాని వివాహానికి పుస్తె మట్టెలు అందజేశామని, వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ముక్కోటి దేవతలను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.