Site icon PRASHNA AYUDHAM

ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గింపు

IMG 20250115 WA0075

*ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గింపు*

*సంక్రాంతి పండగ వేళ.. మందుబాబులకు మద్యం కంపెనీలు భారీ శుభవార్త చెప్పాయి. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా.. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. మరో 6 కంపెనీలు కూడా తాజాగా ధరలు తగ్గించాయి. మరోవైపు.. మద్యం ధరలను తగ్గించి.. విక్రయాలను మరింత పెంచుకోవాలని మద్యం కంపెనీలు భావిస్తున్నాయి. ఇక ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ మద్యం ధరలను తగ్గించటంతో ఇతర కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ కంపెనీలు కూడా ధరల తగ్గింపుకు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. మరోవైపు.. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.*

*అదే సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. ఫలితంగా మద్యం విక్రయాలపై అధికారుల నిఘా పెరిగింది. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మాన్షన్‌ హౌస్‌ కంపెనీ.. ఒక్కో క్వార్టర్‌పై రూ.30 తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 తగ్గింది.*

Exit mobile version