*_రైతులకు శుభవార్త..త్వరలో పంట నష్టానికి పరిహారం.._*
హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
పంట నష్టం వివరాలు సేకరించేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికారుల నుంచి పూర్తి స్థాయి నివేదిక రాగానే పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.