ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై22
తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపు విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మంత్రి శ్రీధర్ బాబు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను ఆదేశించారు. గెస్ట్ లెక్చరర్ల వేతనాన్ని రూ. 28 వేల నుంచి రూ.42 వేలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు..
