Headlines
-
“గూగుల్ మ్యాప్‌పై కేసు: యూపీలో ముగ్గురు ప్రాణాలు పోగొట్టిన ఘటన”
-
“గూగుల్ మ్యాప్ నావిగేషన్ వల్ల ప్రమాదం: ముగ్గురు చనిపోయారు”
-
“యూపీ ఘటనపై పోలీసుల చర్య: గూగుల్ అధికారులపై కేసు”
-
“గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ప్రమాదంలో పడి ముగ్గురు చనిపోయారు”
-
“యూపీలో గూగుల్ మ్యాప్ తప్పిదంతో బ్రిడ్జి ప్రమాదం: కేసు నమోదు”
తెలియని చోటు వెళ్లినప్పుడు చాలామంంది గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటారు..మ్యాప్ నావిగేషన్ ఫాలో అయి వెళుతుంటారు. అయితే గూగుల్ మ్యాప్ నమ్ముకొని తప్పుదారి పట్టడం, చేరాల్సిన చోటికి కాకుండా ఎక్కడికో వెళ్లడం, కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు రావడం వంటి కాంప్లెయింట్స్ ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ పై ఎక్కువయ్యాయి..ఇటువంటి కేసుల్లో గూగుల్ పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు..తాజాగా యూపీలో గూగుల్ మ్యాప్ నావిగేషన్ లో వెళ్లి ముగ్గురు మృతిచెందిన ఘటనలో మాత్రం పోలీసులు గూగుల్ అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
ఆదివారం యూపీలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే..గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు రామ్ గంగా నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని గూగుల్ అధికారులతోపాటు మరో నలుగురు పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ అధికారులపై కేసులు నమోదు చేశారు.
గూగుల్ మ్యాప్ నావిగేషన్ లో గుడ్డిగా వెళ్లడంతో కారులో రామ్ గంగా నదిలోపడి ఫరుఖ్కాబాద్ జిల్లాకు చెందిన నితిన్, అజిత్ , అమిత్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వీరిలో నితిన్, అజిత్ సోదరులు కాగా.. మరో వ్యక్తి అమిత్ మైన్ పురి జిల్లా కు చెందిన వ్యక్తి. నొయిడా నుంచి ఫరీద్ పూర్ కు ఓ పెళ్లికి వెళుతుండగా రాయబరేలీ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గూగుల్ మ్యాప్ రీజినల్ అధికారిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత శిక్షాస్మృతి సెక్షన్ 105 కింది కేసు నమోదు చేసినట్లు బూదాన్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.
అయితే యూపీ ఘటనపై గూగుల్ మ్యాప్ అధికారులు స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తాం..భవిష్యత్తులో మేం కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.