ఫేక్ అకౌంట్స్కు చెక్ పెట్టేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్ తీసుకురానున్న గూగుల్
గూగుల్ సంస్థ ఫేక్ అకౌంట్స్కు చెక్ పెట్టే పనిలో పడింది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ అందించేందుకు సిద్ధమైంది. “కంపెనీలకు సంబంధించిన అధికారిక అకౌంట్స్ను గుర్తించేందుకు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్‌లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్‌సైట్ల పక్కనే చెక్ మార్క్‌లను చూపించేలా టెస్ట్లు నిర్వహిస్తున్నాం.” అని గూగుల్ అధికారులు వెల్లడించారు.