పదవీ విరమణ రోజే బాలికలకు సైకిళ్లు అందించిన జిల్లా స్పోర్ట్స్ అధికారి గోపాల్ రావు

సేవా నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం – పదవీ విరమణ రోజే బాలికలకు సైకిళ్లు అందించిన జిల్లా స్పోర్ట్స్ అధికారి గోపాల్ రావు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 29

“మన విధి నిర్వహణలో ప్రజలకు అందించగల సహాయం చేయడమే నిజమైన సేవ” అని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు.

జిల్లా స్పోర్ట్స్ అధికారి గోపాల్ రావు పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ – తన చివరి పనిదినాన కూడా బాలికలు సైక్లింగ్‌లో రాణించాలనే సదుద్దేశ్యంతో వారికి సైకిళ్లు అందించేందుకు ఫైల్ పెట్టి, అనుమతి తీసుకున్న గోపాల్ రావు నిజమైన ఆదర్శప్రాయ అధికారి అని అభివర్ణించారు.

శుక్రవారం జిల్లా సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డి గోపాల్ రావును శాలువ, పూల బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోపాల్ రావు 35 ఏళ్ల సుదీర్ఘ సేవలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 14 జిల్లాల్లో పనిచేసి, ప్రతిచోటా ప్రజల మన్ననలు పొందారని అన్నారు.

“మన సర్వీసు ముగిసిన తర్వాత వెనక్కి చూసుకున్నప్పుడు మనం సంపాదించుకున్న పేరు, మంచితనం కనిపించాలి” అని కలెక్టర్ సందేశం ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం గోపాల్ రావు కుటుంబంతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ముందు, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హరిప్రియ, డీఆర్డీఓ సాంబశివరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి వినోద్ కుమార్, మైనారిటీ అధికారి కాంతమ్మ, డీఎం & హెచ్ఓ ఉమాగౌరీ, బీసీ వెల్ఫేర్ అధికారి ఝాన్సీరాణి, సివిల్ సప్లై డీఎం సుగుణబాయి, అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎఓ రాంమోహన్, ఎల్డీఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment