లైసెన్స్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి 

లైసెన్స్
Headlines in Telugu:
  • గోపులాపూర్ వైన్స్ పై అక్రమ రవాణా ఆరోపణలు
  • మద్యం లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • మద్యం ధరలు: మార్కెట్ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని ఆరోపణ

అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న గోపులాపూర్ వైన్స్ ను సీజ్ చేయండి

లైసెన్స్ రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీ కి, జిల్లా ఎక్సైజ్ అధికారులకు పిర్యాదు

రోజుకు వేలల్లో – నెలకు లక్షల్లో – ఏడాదికి కోట్లల్లో దోపిడీ

స్టిక్కర్ పేరుతో విచ్చల విడిగా దోచుకుంటున్నారని ఆరోపణ

క్వార్టర్ కు రూ.20, బీరుకు రూ.20, హాఫ్ కు రూ.40, ఫుల్లు కు రూ.80 చొప్పున దోపిడీ

మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు

బుగ్గారం విడిసి, యండిసి ల న్యాయ పోరాటం

 

యం.ఆర్.పి. కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న గోపులాపూర్ లోని “శ్రీ లక్ష్మీ నరసింహ వైన్స్ ( జె.టి.ఎల్. 042 )” ను సీజ్ చేయాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు, జిల్లా ఎస్పీ కి, జిల్లా ఎక్సైజ్ అధికారులకు బుగ్గారం విడిసి, ఎండిసి ల ఆధ్వర్యంలో పిర్యాదు చేశారు.

 

ఈ సందర్భంగా బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ చుక్క గంగారెడ్డి విలేఖరులతో మాట్లాడారు.

ఈ వైన్స్ ద్వారా మండలంలోని 11 గ్రామాలలో గల బెల్ట్ షాప్ లకు అక్రమంగా, నాణ్యత లేని నాసిరకం – కల్తీ మధ్యంను, ఎంఆర్ పి కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇట్టి దుకాణం యొక్క

మద్యం లైసెన్స్ రద్దు చేయాలని, లైసెన్స్ దారునిపై, లీజ్ కు తీసుకున్న మద్యం దలారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

స్టిక్కర్ పేరుతో విచ్చల విడిగా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైన్స్ యజమానులు బెల్ట్ షాపులకు హోల్ సేల్ ధరలకు మద్యం ఇవ్వాల్సింది పోయి వారికి ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు అనగా క్వార్టర్ సీసాకు రూ.10, బీరు కు రూ.10, హాఫ్ సీసా కు రూ.20, ఫుల్లు సీసా మద్యం కు రూ.40 చొప్పున అధిక ధరలకు మద్యం ను – స్టిక్కర్ వేసి విక్రయిస్తున్నారని తెలిపారు.

బెల్ట్ షాప్ ల వారు వారి లాభం కోసం క్వార్టర్ సీసాకు రూ.20, బీరు కు రూ.20, హాఫ్ కు రూ.40, ఫుల్లు కు రూ.80 చొప్పున అధిక ధరలతో మండల వ్యాప్తంగా మద్యం ప్రియులను దోచుకోవడం జరుగుతోందన్నారు.

మండల వ్యాప్తంగా ఇలా

రోజుకు వేలల్లో – నెలకు లక్షలల్లో – ఏడాదికి కోట్లల్లో ఈ దోపిడీ జరుగుతోందని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అంతే కాకుండా వైన్స్ యజమానులు, లీజు కు తీసుకున్న మద్యం దళారులు భారీ వాహనాలలో అధికారుల కంటే ఎక్కువ స్థాయిలో బెల్ట్ షాప్ ల వద్దకు వచ్చి ఆకస్మిక తనిఖీల పేరుతో సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ సోదాల్లో ఆయా బెల్ట్ షాప్ లలో విక్రయిస్తున్న మద్యం సీసాలు మావేనా ….! కాదా….! అని నిర్దారించుకుంటూ ఒకవేళ ఎవరి వద్దనైనా ఇతర ప్రాంతాల నుండి తెచ్చిన మద్యం సీసాలు దొరికితే సంబంధిత అధికారులకు పట్టించి తగు చర్యలు కూడా తీసుకుంటామని బెదిరింపులకు, భయ బ్రాంతులకు, ఇతర విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బెల్టు షాప్ దారులు వాపోతున్నట్లు చుక్క గంగారెడ్డి వివరించారు. అనధికారికంగా ప్రైవేట్ వ్యక్తులు భారీ వాహనాలలో వచ్చి నిర్వహించే ఈ తనిఖీలతో ఆయా గ్రామాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలకు గురి కావడం జరుగుతుందన్నారు.

ఈ వైన్స్ ద్వారా లభించే మద్యం కు, ఇతర ప్రాంతాల నుండి తెచ్చిన మద్యం కు నాణ్యతలో చాలా తేడా ఉంటుందని, గోపులాపూర్ వైన్స్ లో లభించే మద్యం మొత్తం కల్తీగా, నాసి రకంగా ఉంటుందని మద్యం ప్రియులు వాపోతున్నారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

నీతి – నిజాయితీగా, న్యాయంగా, ధర్మ బద్ధంగా కొనసాగుతున్న మా

బుగ్గారం విడిసి, యండిసి ల న్యాయ పోరాటంకు అధికారులు సహకరించి బాధ్యులైన వారందరిపై తగు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను, ఇతర ఉన్నతాధికారులను కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న, సహాయ కార్యదర్శి కళ్లెం నగేష్, మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు దసర్తి పూర్ణ చందర్, యాదవ సంఘం అధ్యక్షులు పరుమాల సత్తయ్య, పరుమాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now