ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం వద్ద గోరక్షక్ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్పై గన్తో కాల్పులు జరిపిన ఎంఐఎం పార్టీకి చెందిన ఇబ్రహీం పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గోరక్షక్ ప్రముఖ్ తులసీదాస్ డిమాండ్ చేశారు.
గురువారం విలేకరులతో మాట్లాడుతూ తులసీదాస్, ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ గోవుల రవాణా, గోవధ గ్యాంగులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాదుతోపాటు అనేక జిల్లాలు, మండలాల్లో గోవులను అక్రమంగా తరలిస్తూ గోవధకు పాల్పడుతున్న గుండాలు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో దేవాలయాలపై దాడులు చేసిన నిందితులపై పిచ్చి వారిగా ముద్ర వేసి రక్షించడానికి గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి వైఖరిని ప్రదర్శిస్తే హిందూ సమాజం మౌనంగా ఉండదని తులసీదాస్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాయని స్పష్టం చేశారు.